ఇక సినిమాల్లో నటించను…అభిమానులు క్షమించాలిః కమల్ హాసన్

248
Kamal Hasan
- Advertisement -

లోక నాయకుడు కమల్ హాసన్ అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు2 మూవీలో నటిస్తున్నాడు. దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రం సంచలన విజయం సాధించింది. శంకర్ దర్శత్వం, కమల్ హాసన్ డ్యూయెల్ రోల్ లో నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి.

ప్రస్తుతం ఎన్నికలు ఉండటంతో కొద్ది రోజులు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు కమల్. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో కమల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసినిమా తర్వాత తాను సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు తెలిపారు. ఇది నా అభిమానులకు చేధు వార్తే అయన తప్పక తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రజా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో నా పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈవిషయంలో నా అభిమానులంతా నన్ను క్షమించాలి .. ఎందుకంటే సినిమాలు, రాజకీయాలు ఒకే సమయంలో చేయలేనని చెప్పారు.

- Advertisement -