తెలంగాణ అంటే టీఆర్ఎస్.. నిర్మాత దిల్ రాజు

263
Dil Raju
- Advertisement -

సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఇటివలే జరిగిన ఓ కార్యక్రమంలో సికింద్రబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి తలసాని సాయి కిరణ్ యాదవ్ తో పాటు నిర్మాత దిల్ రాజు పాల్గోన్నారు.

ఈసందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. తెలంగాణ అంటే టీఆర్ఎస్..టీఆర్ఎస్ అంటే తెలంగాణ అని చెప్పారు. తెలంగాణలో మిగతా పార్టీలు తమ ఉనికిని కోల్పోయాయని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ మద్దతు సాయి కిరణ్ కు తప్పక ఉంటుందన్నారు.

ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు ఘన విజయాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. అదే రిజల్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రిపిట్ అవుతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగు సినీ పరిశ్రమకు చాలా చేశారన్నారు. ఈసందర్భంగా సికింద్రబాద్ ఎంపీ గా పోటీ చేస్తున్న తలసాని సాయి కిరణ్‌ యాదవ్ కు శుభాకాంక్షాలు తెలిపారు.

- Advertisement -