నిజాయితీ డబ్బుకు ఇబ్బంది లేదు..అరుణ్ జైట్లీ

191
arun-jaitley-
- Advertisement -

500 రూ..1000 రూ నోట్లును రద్దు ప్రకటనతో ,,దేశవ్యాప్తంగా కొంత గందర గోళ పరిస్థితి నెలకొంది. ప్రధాని మోదీ అనుహ్యం నిర్ణయంతో సామాన్య ప్రజలు రోజు వారి కార్యకలాపాలకు ఇక్కట్లకు గురౌతున్నారు. దేశవ్యాప్తంగా  దీనిపై కొంత అసహానం వ్యక్తం అవుతున్న తరుణంలో…కేంద్ర అర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నల్లధనాన్ని అరికట్టడానికే పెద్ద నోట్ల రద్దు నిర్ణయమని… సామాన్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం కేంద్రానికి లేదని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. మరో రెండు మూడు రొజుల్లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని తెలియజేశారు. ఎన్ని డబ్బులున్నా బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చని..అయితే ఐడీ ప్రూఫ్‌ మాత్రం కచ్చితంగా చూపించాలని ఆయన బుధవారమిక్కడ పునరుద్ఘాటించారు.

arun jaitly

బ్లాక్‌మనీ ఉన్నవారే కేంద్రం ప్రతిపాదనకు కంగారు పడతారన్నారు. నిజాయితీగా సంపాదించిన డబ్బుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జైట్లీ వ్యాఖ్యానించారు. అక్రమంగా డబ్బులు సంపాదించినవారికే అసలైన ఇబ్బంది ఉంటుందన్నారు. పెద్దనోట్ల రద్దు దీర్ఘకాలంలో మంచి ఫలితాన్ని ఇస్తుందని, నగదు లావాదేవీలను సాధ్యమైనంత తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు జైట్లీ తెలిపారు. ఇబ్బందులన్నీ త్వరలో పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. రెండురోజుల క్రితమే బ్యాంకులకు కొత్త కరెన్సీ వెళ్లిందని ఆయన పేర్కొన్నారు. అలాగే పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పలు రంగాలు నష్టాల పాలవుతాయన్న వాదనను జైట్లీ కొట్టిపారేశారు. రియల్‌ ఎస్టేట్‌ ధరలు భారీగా తగ్గుతాయని ఆయన అన్నారు.

- Advertisement -