జయరాం ఎపిసోడ్‌..ఇక శిఖా వంతు..!

212
Shikha choudary
- Advertisement -

ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో విచారణను వేగవంతం చేశారు హైదరాబాద్‌ పోలీసులు. నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌లను హైదరాబాద్‌కు తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు జడ్జి ఎదుట హాజరుపర్చగా వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.

మరోవైపు ఈ కేసులో జయరాం మేనకోడలు శిఖాచౌదరి పాత్రపై నిగ్గు తేల్చేందుకు విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసులిచ్చారు పోలీసులు. ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు రావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

వీణ అనే యువతి పేరుతో జయరాంను ఎందుకు ట్రాప్ చేయాల్సి వచ్చింది…జయరాం హత్య కేసులో ఇంకరెవరి ప్రమేయం ఉందనే విషయాలపై దర్యాప్తు చేయనున్నారు. దీంతో పాటు నిందితులు రాకేశ్,శ్రీనివాస్‌లను 15 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరనున్నారు పోలీసులు.

ఇక ఈ కేసులో శిఖాచౌదరి పనిమనిషి,వాచ్‌మెన్‌,ఆమె స్నేహితులను జూబ్లీహిల్స్ పోలీసులు రహాస్య ప్రాంతంలో విచారించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిఖాచౌదరికి నోటీసులు ఇవ్వడం,ఆమె విచారణకు హాజరైతే మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

- Advertisement -