దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ కీలకపాత్ర పోషిస్తుందని ఎంపీ కవిత తెలిపారు. చౌపాల్ ఆన్ ట్విట్టర్ కార్యక్రమం ద్వారా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన కవిత.. మోడీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమైందన్నారు.
ఎంపీ నిధులు ఏడాదికి కనీసం రూ. 25 కోట్లు ఉండాలన్నారు. ప్రధాని మోడీ గ్రాఫ్ రోజురోజుకి పడిపోతుందని చెప్పారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని టీఆర్ఎస్ ఆహ్వానిస్తోందన్నారు.
దేశరాజకీయాల్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీది గెస్ట్ రోల్ అన్నారు. రాహుల్ గాంధీ గ్రాఫ్‌లో ఎలాంటి పెరుగుదల లేదన్నారు. అన్నిరాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సత్తాచాటుతున్నాయని చెప్పారు.
నిజామాబాద్ నుండే గల్ఫ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇక్కడి నుండే కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు.నిజామాబాద్ కు పసుపుబోర్డు కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. నిజామాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని తెలిపారు.