త్రివిక్రమ్‌పై హేమ విసుర్లు..

259
actress hema
- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై తీవ్రస్ధాయిలో మండిపడింది సినీ నటి హేమ. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన హేమ..త్రివిక్రమ్‌తో క్లాష్ ఏర్పడటానికి గల కారణాలను వివరించారు. తన రెమ్యునరేషన్ విషయంలో త్రివిక్రమ్ వేలు పెట్టడం వల్లే ఆయన సినిమాల్లో కనిపించడం లేదని తెలిపారు. నా రెమ్యునరేషన్ డిసైడ్ చేయడానికి త్రివిక్రమ్ ఎవడని పరుష పదజాలంతో విమర్శలు గుప్పించింది.

సినిమా రెమ్యునరేష్‌ డిసైడ్ చేయాల్సింది నిర్మాత లేదా మేనేజర్. ఒకవేళ నాకు అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేకపోతే.. అమ్మా మేం అంత ఇవ్వలేం.. ఇష్టమైతే చేయండి.. కష్టమైతే మానేయండి అని చెప్తారు. మధ్యలో ఈయనకు సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు. నా ఇగోని హర్ట్ చేయడం వల్ల ఆయనతో మాట్లాడటం మానేశా..ఎదురుపడినా పలకరించేదానిని కాదని తెలిపారు.

త్రివిక్రమ్ అతడు సినిమాలో మెరిసింది హేమ. ఈ సినిమాలో బ్రహ్మానందం – హేమల కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. తర్వాత హేమ కోసం త్రివిక్రమ్ ప్రతి సినిమాలో ఓ రోల్‌ని రాసుకునేవారు. జులాయి, అత్తారింటికి దారేది చిత్రాల్లో హేమకు మంచి పాత్రల్ని ఇచ్చారు. కానీ తర్వాత హేమ–త్రివిక్రమ్‌ మూవీల్లో కనిపించకుండా పోయింది.

- Advertisement -