కేజ్రీవాల్ పై మ‌రోసారి దాడికి య‌త్నం..

240
aravind
- Advertisement -

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు మ‌రోసారి ప్ర‌మాదం త‌ప్పింది. ఇటివ‌లే ఆయ‌నపై సెక్ర‌టేరియ‌ట్ లో కారంపోడితో ఓ వ్య‌క్తి దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఆదాడిని మ‌రువ‌క ముందే మ‌రోసారి ఈఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌తో ఆయ‌న‌కు క‌ల్పిస్తున్న భ‌ద్ర‌త‌పై మ‌రోసారి సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ఈసారి పోలీసులు ముందే ప‌సిగ‌ట్ట‌డంతో సీఎంకు ప్ర‌మాదం త‌ప్పింది. ఓవ్య‌క్తి ఏకంగా ఐదు బుల్లెట్ల‌తో కేజ్రీవాల్ ను వ‌ద్ద‌కు వ‌చ్చాడు. అత‌న్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

kejriwal

ఈసంద‌ర్భంగా ఇవాళ కొంద‌రు ముస్లిం ప్ర‌తినిధులు కేజ్రీవాల్ ను క‌లిసేందుకు రాగా అందులో ఉన్న మొహ‌మ్మ‌ద్ ఇమ్రాన్ అనే వ్య‌క్తి వ‌ద్ద ఈబుల్లెట్లు దొరికాయి. ఆవ్య‌క్తిని తనిఖీ చేస్తుండగా, వాలెట్ లో ఈ బుల్లెట్లు కనిపించాయి. దీంతో ఆయుధాలను కలిగివున్నాడన్న నేరంపై అతన్ని అరెస్ట్ చేశారు. ఈ బెల్లుట్లు త‌న‌కు మ‌సీదులోని హుండీలో దొరికాయ‌ని, వాటిని త‌న వ్యాలెట్ లో మ‌రిచిపోయాన‌ని వివ‌ర‌ణ ఇచ్చాడు నిందితుడు.

- Advertisement -