గజ్వేల్ టీఆర్ఎస్ గెలుపు ఖామమన్నారు అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్. నేడు గజ్వేల్ నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఆయన ఇవాళ సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరిగింది. నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకూ చేసింది కొంతేనని, వచ్చే ఐదేళ్లలో గజ్వేల్ నియోజకవర్గంలో సొంతిల్లు లేకుండా ఏ వ్యక్తీ ఉండొద్దని, పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతివ్యక్తీ సొంతిల్లు నిర్మించుకోవాలని సూచించారు.
వచ్చే వర్షా కాలం నాటికి కొండపోచమ్మ జలాశయాన్ని నింపుతామని, తొలి దశలో చెరువులను నింపుతామన్నారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికల తర్వాత గజ్వేల్ లో సొంతిల్లు లేని కుటుంబం లేకుండా చేస్తామని చెప్పారు. గజ్వేల్ లో ప్రతి ఇంటికీ వంద శాతం రాయితీతో రెండు పాడిపశువులు ఇస్తామని హామీ ఇచ్చారు.