‘భైర‌వ‌గీత’ ట్రైల‌ర్..

192
Bhairava Geetha
- Advertisement -

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో అయన శిష్యుడు సిద్ధార్థ్ తాతోలు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘భైరవగీత’. సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇంటెన్స్ ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయింది. ఇంత‌క ముందు ఓ ట్రైల‌ర్ విడుద‌ల చేసి సినిమాపై అంచ‌నాలు పెంచిన యూనిట్‌, తాజాగా మ‌రో ట్రైల‌ర్ విడుద‌ల చేసి మ‌రింత ఆస‌క్తి క‌న‌బ‌ర‌చేలా చేశారు.

Bhairava Geetha

వాస్త‌వ ఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ ప్రేమ క‌థ చిత్రంలో ధనుంజయ్, ఇర్రామోర్‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ‘‘మనుషులను బానిసలుగా చూసే ప్రతి ఒక్కరి గుండెల్లో దింపే కత్తే దీనికి సమాధానం’’ అంటూ ఫ్యాక్షన్ పెద్దలపై తిరుగుబాటును కూడా ఈ ట్రైలర్లో చూపించారు. ‘‘సాటి మనుషులను బానిసలుగా చూడాలంటే నీ గుండెలు అదరాలి’’ అంటూ ముగించి సినిమాలపై అంచనాలు పెంచారు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ మూవీ నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -