ఛత్తీస్‌గఢ్‌:చివరి క్షణాల్లో అమ్మకు సందేశం…(వీడియో)

246
dd cameraman
- Advertisement -

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మంగళవారం మావోలు జరిపిన దాడిలో ఇద్దరు జవాన్లు,దూరదర్శన్ కెమెరామెన్ అచ్చుతానంద్‌ చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చివరి నిమిషం వరకు తన విధులు నిర్వర్తించేందుకు ప్రయత్నించారు డీడీ అసిస్టెంట్ కెమెరామెన్ మోర్ ముక్త్. అక్కడి పరిస్ధితులపై ఇచ్చిన రిపోర్టు అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.

తన తల్లికి కన్నీటి వీడ్కోలు చెబుతూ ఎదురుగా మృత్యువు ఉన్నా తనకు భయం లేదంటూ చెప్పిన మాటలు  ఆయన నిబద్ధత, కన్నతల్లిపై ఉన్న ప్రేమ, ఆప్యాయత కళ్లకు కడుతోంది. ప్రస్తుతం ఆస్పత్రిలో మోర్ ముక్త్ చికిత్స తీసుకుంటుండగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు ఈ ఘటనలో మావోయిస్టుల చేతిలో చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.

- Advertisement -