మీరు హారర్ థ్రిల్లర్ సినిమాలు చూసే ఉంటారు. ఒక ఇంట్లోకి అడుగుపెడితే చాలు.. గ్యారంటీగా అందరూ చనిపోతుంటారు. ఆ ఇంటిని ఏదో ప్రేతాత్మ, భూతం, దెయ్యం వెంటాడుతూ ఉంటుంది. రీసెంట్‌గా ఇలాంటి జానర్ సినిమాలు ఎన్నో వచ్చాయి. అలాంటి సీన్‌ను తలిపించే సంఘటన ఒకటి బల్గేరియాలో జరిగింది. మొబిటెల్ అనే టలికాం సంస్థకు చెందిన ఓ ఫ్యాన్సీ నంబర్‌ను వినియోగించిన వారంతా మృత్యు ఒడికి చేరుకుంటున్నారట. ఆ నెంబర్ ఏంటంటే.. 0888888888. నెంబర్ మాత్రం భారీ ఫ్యాన్సీ నెంబర్. కానీ, ఈ నెంబర్ చూసి ముగ్దులై తీసుకున్నవాళ్లంతా చనిపోతున్నారు. ఈ మరణాల మిస్టరీ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నెంబర్‌ని మొట్టమొదట వాడింది ఆ కంపెనీ సీఈవో వ్లాదిమిర్ గ్రాస్నవ్. 2001లో ఆయన కేన్సర్‌తో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆయన చనిపోయిన కారణం వేరే ఉందని, బిజినెస్‌లో కలహాలు, హానికారక రేడియో యాక్టివ్ పాయిజనింగ్ వల్లే ఆయన మృత్యువాత పడ్డారని అక్కడి మీడియా పేర్కొంది. ఆయనపై హానికారక రేడియో యాక్టివ్ పాయిజినింగ్ జరిగినట్లు తెలిపింది. అనంతరం ఆ నెంబరును 2003లో కాన్‌స్టాంటిన్ డిమిట్రోవ్ అనే మాఫియా డాన్ వినియోగించాడు. అదే సమయంలో అతను ఒక గుర్తు తెలియని వ్యక్తి చేతిలో హతమయ్యాడు.
ఇక, 2005లో ఇదే నెంబర్‌ని దిష్‌లీవ్ అనే బిజినెస్ మేన్ తీసుకున్నాడు. ఇతను కూడా హత్యకు గురయ్యాడు. దీంతో, మొబిటెల్‌కి ఏం అనుమానం వచ్చిందో ఏమో ఆ నెంబర్‌ని బ్లాక్ చేశారు. అప్పటినుంచి ఇంతవరకు మరెవరికీ ఆ నెంబర్‌ని ఇవ్వలేదు. ఈ నెంబర్ కోసం ఎవరైనా ట్రై చేస్తే.. అవుట్ సైడ్ నెట్‌వర్క్ కవరేజ్’ అని వినిపిస్తోంది. ఈ నెంబర్‌ని వాడిన వినియోగదారులు ఎందుకు చనిపోతున్నారన్న ప్రశ్నకు కంపెనీ అనూహ్యమైన సమాధానం ఇచ్చింది. దీనిపై ఎలాంటి కామెంట్స్ చెయ్యమని, అయినా వ్యక్తిగత నెంబర్‌ల గురించి మాట్లాడమని మొబిటెల్ సంస్ధ వివరించింది. అయితే, ఆ నెంబర్‌లకీ, ఈ మర్డర్‌లకు లింక్ ఏంటనేది హాట్ టాపిక్‌గా మారింది.