హీరోగా దిల్‌రాజు…!

252
online news portal
- Advertisement -

టాలీవుడ్‌లో టాప్‌ ప్రొడ్యూసర్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఏవరైనా ఉన్నారా… అంటే అది దిల్‌రాజు మాత్రమే. టాలీవుడ్‌లో దిల్ రాజు బ్యాన‌ర్ నుంచి వ‌చ్చే సినిమాల‌పై ఎలాంటి అంచ‌నాలు ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తాజాగా దిల్‌రాజుపై సీనియర్‌ హీరో మురళీమోహన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

online news portal

రీసెంట్‌గా హెచ్.ఎం రెడ్డి మెమోరియల్ అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైన మురళిమోహన్ మాట్లాడుతూ…. దిల్‌రాజు చూడడానికి అందగా హీరోలా ఉంటారని, ఆయ‌న హీరోగా న‌టిస్తానంటే తాను ఆ సినిమాను నిర్మిస్తాన‌ని… సినిమా రంగానికి ఎంతో మంది ప్ర‌తిభావంతుల‌ను ప‌రిచయం చేసిన ఘ‌న‌త దిల్ రాజుది అని మురళీ మోహాన్‌ పొగడ్తలతో ముచెత్తారు. దిల్‌రాజుకు మంచి సంగీత అభిరుచి కూడా ఉంద‌ని..అందుకే ఆయ‌న నిర్మించిన సినిమాల‌న్ని మ్యూజిక‌ల్ హిట్స్‌ అయ్యాయ‌న్న విష‌యాన్ని ఈ వేడుకలో ముర‌ళీమోహ‌న్ గుర్తు చేశారు.

online news portal

సినిమా హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా…నిర్మాతగానే కాదు డిస్ట్రిబ్యూటర్ గా కూడా మంచి అభిరుచి కలిగిన దిల్ రాజు ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తుంటారు. అసలు ఆయనకు కోపం వస్తుందా రాదా అన్న డౌట్ కూడా వస్తుంది . అంతేకాదు తన సినిమాల ప్రొడక్షన్ విషయంలో కాని ప్రమోషన్స్ లో కాని దిల్ రాజు స్వయంగా పాల్గొంటాడు. ఇంత యాక్టివ్ అండ్‌ ఎనర్జీగా ఉండే నిర్మాత మరొకరు లేరు అని ఫిల్మ్‌ ఇండ్రస్టీలో వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. అయితే అతనికో పెళ్లి చేసుకునే కూతురు ఉన్నదని విషయం ఎవరికి తెలియదు. ఈ మధ్యనే ఆమె పెళ్లి వార్తతో అందరికి షాక్ ఇచ్చాడు దిల్ రాజు. దిల్ రాజుని హీరోగా పెట్టి సినిమా తీస్తే సినిమా ఏవిధంగా ఉంటుందో అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

online news portal

అయితే…మురళి మోహన్ చేసిన వ్యాఖ్యలకు దిల్ రాజు నవ్వే సమాధానం అయ్యింది. హెచ్.ఎం రెడ్డి గారి మోమోరియల్ అవార్డ్ తనకు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని.. తనకు లభించిన ఈ గౌరవం చాలా ప్రత్యేకమని అన్నారు దిల్‌రాజు. ఓ పక్క నిర్మాతగా సినిమాలు చేస్తూనే మరో పక్క డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు ఫాంలో ఉన్నాడనే విషయం తెలిసిందే. పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలో కూడా కంటెంట్ తనకు నచ్చితే ఆ సినిమాను తన బ్యానర్లో రిలీజ్ చేసి చిన్న బడ్జెట్ సినిమాను పెద్ద సినిమాను చేసేస్తాడు దిల్ రాజు.

- Advertisement -