గల్లా అశోక్‌ మూవీ ప్రారంభం

383
- Advertisement -

సినిమా ప్రపంచంలో సూపర్ స్టార్ కృష్ణ స్టైలే వేరు. తన నటనాశైలీతో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో సూపర్ స్టార్ గా నిలిచిపోయారు. పాటకు తగినట్టుగా స్టెప్పులు, డైలాగ్‌కు తగినట్టుగా హావభావాలు పలికించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక కృష్ణ వారసుడిగా చిన్ననాటి నుంచే సినిమాలు చేస్తూ తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని.. టాలీవుడ్‌లో మంచి ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.

టాలీవుడ్‌లో ఎంతోమంది వారసులు సినిమాలకు ఎంట్రీ ఇచ్చారు. అయితే తాజాగా మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్‌ను షేక్ చేసేందుకు సిద్దమవుతున్నాడు. కృష్ణ, రాఘవేంద్రరావు, దిల్ రాజు తదితరుల సమక్షంలో అశోక్ డెబ్యూ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది.

అశోక్ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రానికి “అదే నువ్వు అదే నేను” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నూతన దర్శకుడు శశి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అశోక్ సరసన నభా నటాషా హీరోయిన్‌గా నటిస్తుండగా, హిప్ హాప్‌ తమీజా సంగీతం అందిస్తున్నాడు.

అతి త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లనున్న క్రమంలో కృష్ణ ఈ చిత్రానికి తొలి క్లాప్ కొట్టారు. ఇప్పటికే మహేష్ బాబు తనయుడు గౌతమ్ కూడా 1 నేనొక్కడితో వెండితెరపై అదరగొట్టాడు. కృష్ణ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ బాబు, మంజుల, ఆమె కూతురు జాన్వీ కూడా వివిధ సినిమాల్లో మెరిసారు. ఇక ఇప్పుడు అశోక్‌ను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలిమరి..

- Advertisement -