జార్జియాలో యుద్ధానికి సైరా..!

240
Syraa chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి-లేడి అమితాబ్ నయనతార కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్ర సైరా. స్వాతంత్య్ర పోరాటంలో తెలుగు ప్రజలను ముందుండి నడిపించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటుండగా క్లైమాక్స్‌ సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ని మొదలు పెట్టనున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సన్నివేశాలను చిత్రీకరించడం కోసం భారీస్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ఈ పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తాయనీ, సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్, ఇతర ముఖ్య పాత్రల్లో జగపతిబాబు,విజయ్ సేతుపతి ,సుదీప్ నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి..కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. ఈ సినిమాను కూడా రాంచరణ్ ప్రొడ్యూస్ చేస్తారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

- Advertisement -