‘ఏజెంట్’ నుండి సాక్షి వైద్య లుక్‌..

263
Sakshi Vaidya
- Advertisement -

అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’.ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేంద్ర రెడ్డి తెరకెక్కిస్తున్నడు. ఈ సినిమాను ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇందులోని అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. ‘ఏజెంట్’ చిత్రాన్ని ప్రకటించిన రోజున విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈమూవీ నుండి అదిపోయే అప్‌ డేట్‌ ఇచ్చారు.

ఈ రోజు సాక్షి వైద్య పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. జీన్స్ ఫ్యాంట్, బ్రైన్ కలర్ టాప్‌తో సాక్షి వైద్య లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈమె లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సాక్షి కీలకమైన పాత్ర చేస్తున్నట్టు సమాచారం. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మమ్ముట్టి విలన్‌గా నటిస్తున్నాడు.

- Advertisement -