మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత. గురువారం (అక్టోబర్ 11) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసింది. టాలీవుడ్‌లో నాన్ బాహుబలి రికార్డులను చెరిపేసి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో దిల్ రాజు, తమన్, సునీల్‌తో కలిసి పాల్గొన్న త్రివిక్రమ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఫ్యాక్షనిజాన్ని కొత్తకోణంలో చూపించాలన్న మా ప్రయత్నం విజయవంతం అయిందని తెలిపారు. యుద్దం లేకుండా విజయం సాధించాలన్న బేసిక్ పాయింట్‌తో ప్రేక్షకులను మెప్పించగలిగామని తెలిపారు. తొలి షో నుంచే హిట్ టాక్ వచ్చిందని…నా కంటే ఎక్కువగా కథను నమ్మిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు.ఇంతటి ఘనవిజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు.
ఫైట్ మాస్టర్స్ రామ్,లక్ష్మణ్ సలహాతో క్లైమాక్స్‌ను మార్చామని చెప్పారు త్రివిక్రమ్. వారు చెప్పిన సలహా రిస్క్ అయినా మంచి ఫలితం ఇచ్చిందన్నారు. ఎన్టీఆర్ ఒప్పుకోవడం వల్లే సినిమా చక్కగా వచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు యుఎన్‌లో కూడా సత్తాచాటుతోంది అరవింద సమేత. యుఎస్‌లో ఇప్పటివరకు ఉన్న ఎన్టీఆర్ సినిమా రికార్డులను తిరగరాసింది అరవింద సమేత. దసరా సెలవులు కావడంతో రానున్న రోజుల్లో వసూళ్ల జోరు మరింత ఉపందుకొనుంది. ఓవరాల్‌గా అజ్ఞాతవాసి ఫ్లాప్‌తో తన కలానికి పదునుపెట్టి త్రివిక్రమ్ చేసిన ప్రయత్నం సత్ఫలితాన్నిచ్చింది.