రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ప్రచారం జోరందుకుంది. తెలంగాణ రాష్ట్రంలో విపక్ష పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు టీఆర్ఎస్ అభ్యర్థులు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల నుంచి ఉహించని మద్దతు లభిస్తోంది. పలు గ్రామాల్లో ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేస్తామంటూ ఏకగ్రీవ తీర్మాణాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే 105 మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించిన కేసీఆర్…మరో రెండు రోజుల్లో రెండో జాబితాను కూడా ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన పల్లు సర్వేలు టీఆర్ఎస్ విజయం ఖాయమని తెలుపుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు తిరుగులేదని ఆజ్‌తక్ ఇండియా-టుడే తన సర్వే రిపోర్ట్‌లో పేర్కొంది. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు అత్యధికంగా 43శాతం .. కాంగ్రెస్‌కు 18శాతం , బీజేపీకి 15శాతం ఓట్లు మాత్రమే వస్తాయని వివరించింది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య ఓట్ల తేడాలో భారీ వ్యత్యాసం కన్పిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై 64శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు పేర్కొంది. టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందుతారని అంచనా వేసింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఆజ్‌తక్- ఇండియాటుడే సర్వే చేపట్టింది.