‘శైలజారెడ్డి అల్లుడి’కి భారీ ఓపెనింగ్స్..

243
- Advertisement -

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. నాగచైతన్యకు అత్తగా రమ్యకృష్ణ నటించారు. మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిషోర్, పృథ్వీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీతో పక్కా కమర్షియల్ సినిమా తెరకెక్కిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.

Shailaja Reddy Alludu

సెప్టెంబర్ 12న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, తొలి రోజున భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఒక్క నైజామ్ లోనే 2.50 కోట్ల షేర్ ను .. సీడెడ్ లో 1.04 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా, రెండు తెలుగు రాష్ట్రాల్లోను కలుపుకుని 6.93 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా సమాచారం. మారుతి మార్క్ కథాకథనాలు .. రమ్యకృష్ణ నటన ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా చెబుతున్నారు. అప్పట్లో నాగార్జున చేసిన అల్లుడి పాత్రలాగే నాగ చైతన్య కూడా తన నటనతో అందరగొట్టాడని అక్కినేని అభిమానులు తెగ సంబరపడుతున్నారు.

- Advertisement -