2018 ‘సైమా’ విజేతలు వీరే.. సోషల్ మీడియాలో వైరల్..

232
SIIMA 2018 Awards
- Advertisement -

(సైమా) సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరగబోతోంది. కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు నుండి నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. సెవెంత్ ఎడిషన్ సైమా అవార్డ్స్ ఫంక్షన్ సెప్టెంబర్ 14,15 తేదీలలో దుబాయ్‌లో వైభవంగా జరగనుంది. 7వ ఎడిషన్ సైమా అవార్డ్స్ మరింత కలర్ ఫుల్‌గా జరగనుంది.

గతంలో సైమా అవార్డ్స్ దుబాయ్, అబుదబి, షార్జాహ్, మలేషియా, దుబాయ్, సింగపూర్, అబుదబిలో జరిగింది. ఈసారి దుబాయ్‌లో ఈ వేడుక భారీ ఎత్తున జరగబోతోంది. అయితే ఈ అవార్డులు ఇంకా ప్రకటించకుండానే సోషల్ మీడియాలో విజేతల జాబితా ప్రత్యక్షం అయ్యింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ అవార్డుల జాబితాను మీరు చూడండి..!

SIIMA 2018 Awards

తెలుగు విజేతలు :

ఉత్తమ చిత్రం : బాహుబలి 2
ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (బాహుబలి 2)
ఉత్తమ హీరో : ప్రభాస్ (బాహుబలి 2)
ఉత్తమ హీరోయిన్ : కాజల్(నేనే రాజు నేనే మంత్రి)
ఉత్తమ సహాయ నటుడు : ఆది(నిన్ను కోరి)
ఉత్తమ సహాయ నటి : భూమిక (ఎంసీఏ)
ఉత్తమ సంగీత దర్శకుడు : ఎంఎం కీరవాణి (బాహుబలి 2)
ఉత్తమ గాయణి : మధుప్రియ(ఫిదా)
ఉత్తమ గాయకుడు : కాలభైరవ (బాహుబలి 2)
ఉత్తమ విలన్ : రానా(బాహుబలి 2)

కోలీవుడ్ విజేతలు :

ఉత్తమ చిత్రం : విక్రమ్ వేద
ఉత్తమ దర్శకుడు : అట్లీ(మెర్షల్)
ఉత్తమ హీరో : శివ కార్తికేయన్
ఉత్తమ హీరోయిన్ : నయనతార
ఉత్తమ సహాయ నటుడు : ఎంఎస్ భాస్కర్
ఉత్తమ సహాయ నటి : శివద
ఉత్తమ సంగీత దర్శకుడు: ఏఆర్ రహమాన్
ఉత్తమ గాయని : లుక్సిమి శివనేశ్వరి
ఉత్తమ గాయకుడు : సిద్ శ్రీరామ్
ఉత్తమ విలన్ : ఎస్ జే సూర్య

- Advertisement -