వ్యాపారసంస్థగా మారిన టీజేఎస్‌

273
jyotsna tjs
- Advertisement -

టీజేఎస్ ఓ వ్యాపార సంస్థలా మారిందని మండిపడింది ప్రొ. జ్యోత్స. టీజేఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జోత్స్న ఆ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన జోత్య్న ..టీజేఎస్ పార్టీ వైఖరిని తప్పుబట్టింది.

టీజేఎస్ కన్వినర్ సత్యం గౌడ్ తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. పార్టీ ఫండ్‌గా ఎన్నికోట్లు వసూలు చేశారో చెప్పాలని దిలీప్‌ కుమార్‌ని డిమాండ్ చేసింది జోత్స్న.తెలంగాణ జనసమితిలో వ్యాపారం నడుస్తున్నదని, నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్నారని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదని ..టీజేఎస్ పబ్లిక్ లిమిటెడ్ సంస్థలా మారిందని దుయ్యబట్టింది.

కోదండరాంను అడ్డంపెట్టుకొని దిలీప్‌కుమార్ సాగిస్తున్న అడ్డగోలు వ్యవహారాలుసహా అన్ని విషయాలను త్వరలో బయటపెడతానని స్పష్టం చేసింది. ప్రజల ఆకాంక్ష కోసం టీజేఎస్ పనిచేయడం లేదని తెలిపింది. టికెట్లు అమ్ముకునే పార్టీలా టీజేఎస్ తయారైందని..తాను చేసిన ఆరోపణలపై బహిరంగచర్చకు సిద్ధమని స్పష్టం చేసింది.

- Advertisement -