దొంగగా కనిపించనున్న ప్రభాస్..?

235
- Advertisement -

ప్రభాస్ హీరోగా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘సాహో’.సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాహుబలి తరువత ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. హిందీలో కూడా ఈ సినిమా రూపొందుతుండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రభాస్ మళ్లీ తన బాక్స్ ఆఫీస్ స్టామినను చూపిస్తాడు అని మీడియాలో కథనాలు వెలువాడుతున్నాయి.

Prabhas

‘సాహో’ సినిమాకి సంబంధించి ప్రభాస్ లుక్ బయటికి వచ్చాక, ఆయన పోషించేది రాబిన్ హుడ్ తరహా పాత్ర కావొచ్చని సినీ వర్గాలలో గుస గుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆయన ఈ సినిమాలో ప్రభాస్‌ ఒక అంతర్జాతీయ వజ్రాల దొంగగా కనిపిస్తాడనేది తాజా సమాచారం. వివిధ దేశాల్లో ప్రాచీన కాలానికి చెందిన అత్యంత ఖరీదైన వజ్రాలపై కన్నేసి .. పక్కా ప్లానింగ్‌తో వాటిని అపహరించే దొంగగా ప్రభాస్ కనిపిస్తాడట.

ఆయనను పట్టుకోవడానికి ఇంటర్ పోల్ అధికారులు ఎంతగా ప్రయత్నించినా క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతుంటాడు. ఆయన ఎందుకిలా వజ్రాలను కాజేస్తుంటాడనే విషయం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ వుంటుందనే టాక్ వినిపిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈయనను పట్టుకోవడానికి నియమించబడిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా శ్రద్ధా కపూర్ కనిపించనుందట. ప్రస్తుతం రొమేనియాలో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇది పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టి వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని యోచిస్తున్నారు‌.

- Advertisement -