‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ ప్రారంభించాడు..

212
- Advertisement -

యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా “డియర్ కామ్రేడ్” రెగ్యులర్ షూటింగ్ ఇవాళ (ఆగస్ట్ 6) మొదలైంది. ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని తొండంగిలో చిత్రీకరణ ప్రారంభమైంది. యువ ప్రతిభాశాలి భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక కథానాయికగా నటిస్తోంది. “ఫైట్ ఫర్ వాట్ యు లవ్” అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ ఎమోషనల్ డ్రామాలో విజయ్ దేవరకొండ ఆంధ్రా అబ్బాయిగా కనిపించనున్నాడు.

Dear Comrade Shooting Starts

ఈ మూవీలో ఆంధ్రా స్లాంగ్‌లో విజయ్ చెప్పే డైలాగులు విశేషంగా ఆకట్టుకోనున్నాయి. సోషల్ రెస్పాన్సబిలిటీ ఉన్న ఇంటెన్స్ రోల్‌ను విజయ్ ఈ చిత్రంలో పోషిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చనున్న ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ “డియర్ కామ్రేడ్” చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Dear Comrade Shooting Starts

తారాగణం: విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న తదితరులు.. సాంకేతిక వర్గం: కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: భరత్ కమ్మ, బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్-బిగ్ బెన్ సినిమాస్, నిర్మాతలు: నవీన్ యెర్నేని-రవి శంకర్ యలమంచిలి-మోహన్ చెరుకూరి-యష్ రంగినేని, సహ-నిర్మాత: ప్రవీణ్ మార్పురి, సి.ఈ.ఓ: చెర్రీ, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, డి.ఓ.పి: సుజిత్ సారంగ్, ఎడిటర్-డి.ఐ కలరిస్ట్: శ్రీజిత్ సారంగ్, మాటలు: జై కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు, లిరిక్స్: కృష్ణకాంత్, చైతన్య ప్రసాద్, వనమాలి, రెహమాన్, కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్ బైరి-శ్రావ్యవర్మ, యాక్షన్ డైరెక్టర్: జి.మురళి, కొరియోగ్రఫీ: రఘు మాస్టర్, పబ్లిసిటీ డిజైన్స్: అనిల్ & భాను, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్.

- Advertisement -