సుశాంత్, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘చి ల సౌ’. అన్నపూర్ణ స్టూడియోస్, సిరునీ సినీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్ కుమార్, జస్వంత్ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్ 3న సినిమా విడుదలకానుంది. పెళ్లి చూపుల్లో కలుసుకున్న ఒక అమ్మాయి .. అబ్బాయి ఓ మర్డర్ కారణంగా ఒక రాత్రంతా ఒకచోట వుండి పోవలసి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందనేదే కథాంశంతో ఈ మూవీని రూపొందించారు. సమంత కోసం ‘చి ల సౌ’ స్పెషల్ షో వేశారు. ఈ సినిమా చూసిన సమంత తనదైన శైలిలో స్పందించింది.
సమంత మాట్లాడుతూ..11 ఏళ్లుగా నేను, రాహుల్ మంచి మిత్రులం. నా కెరీర్ బిగినింగ్ నుండి ఈ స్టేజ్ వరకు రాహుల్ నాకు సపోర్ట్ అందిస్తూ వచ్చాడు. తనకు మంచి భవిష్యత్ ఉండాలని నేను ఆ దేవుడ్ని చాలా సార్లు ప్రార్థించాను కూడా. తను మంచి హార్డ్‌వర్కర్. ఈ సినిమాను తను చూడమనగానే.. భయపడుతూ చూశాను. ఎందుకంటే.. నా స్నేహితుడు యాక్టింగ్‌ను దాటి డైరెక్టర్ కావాలనుకుని ఆశగా చేసిన సినిమా. చూసిన తర్వాత ఏం చెప్పాల్సి వస్తుందోనని అనుకున్నాను.
కానీ సినిమా చూస్తున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. రాహుల్ యాక్టర్‌గా నాకు కనెక్ట్ కాలేదు కానీ.. డైరెక్టర్‌గా కనెక్ట్ అయ్యాడు. కొత్త సుశాంత్‌ని తెరపై చూస్తారు. ఈ సినిమాలో రాహుల్‌పై నమ్మకంతో సుశాంత్ నటించాడు. ఆ కాన్ఫిడెన్స్ స్క్రీన్‌పై కనపడుతుంది. రుహని ఫైర్ క్రాకర్‌గా పేరు తెచ్చుకుంటుంది. తనకు అవార్డ్స్ కూడా వస్తాయి. అందరూ ఎగ్జయిట్‌మెంట్‌గా వెయిట్ చేస్తున్నాం” అన్నారు.