చిరు… సైరా సెట్స్‌ కూల్చివేత…!

190
chiru sye raa

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ సైరా. మెగాస్టార్ చిరంజీవితో పాటు అమితాబ్ వంటి సీనియర్ నటులతో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ పడింది. శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన సెట్స్‌ను కూల్చివేశారు అధికారులు.

రాంచరణ్ రంగస్థలం సెట్స్‌ వేసిన స్థలంలోనే సైరా షూటింగ్ జరుగుతోంది. అయితే అనుమతి లేకుండా సెట్స్ వేయడంతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీంతో సైరా షూటింగ్ నిలిచిపోయింది.

సైరా సెట్స్ నిర్మాణంపై పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో సెట్స్‌ను కూల్చివేశామని అధికారులు తెలిపారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉందని తాము లీజుకు తీసుకుని సెట్స్ వేశామని చెబుతున్నారు. మొత్తంగా చిరంజీవి సైరా సెట్ కూల్చివేయడం చర్చనీయాంశంగా మారింది. చిరంజీవికి ఇది 151వ సినిమా కాగా ఆయన తనయుడు రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహస్తున్నారు.