ప్రముఖ నిర్మాత రాఘవ…ఇకలేరు

201
raghava tollywood
- Advertisement -

కళామతల్లి మరో ముద్దుబిడ్డను కొల్పోయింది. హిట్ చిత్రాల నిర్మాత కోటిపల్లి రాఘవ(105) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.జూబ్లిహిల్స్ లోని తన నివాసంలో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. 18వ ఏటనే సినీరంగ ప్రవేశం చేసిన రాఘవ ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించారు. ఎంతోమంది నటులు,దర్శకులను ఇండస్ట్రికి పరిచయం చేశారు. లెజండరీ దర్శకుడు దాసరి నారాయణ రావును పరిచయం చేసింది కూడా రాఘవనే.

1913 డిసెంబర్ 9న తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లిలో జన్మించారు. 1931లో సినీ రంగ ప్రవేశం చేశారు. ఇటీవల ఆయన భార్య మృతిచెందింది. ఆయనకు ఇద్దరు పిల్లలు ప్రశాంతి, ప్రతాప్ మోహన్ ఉన్నారు. పాతాల భైరవి సినిమాకు స్టంట్ మాస్టర్‌గా పనిచేశారు. రఘుపతి వెంకయ్యనాయుడి వద్ద ఆఫీస్ బాయ్ గా ,టంగుటూరి ప్రకాశం వద్ద క్లీనర్ గా కొంతకాలం విధులు నిర్వహించారు.

ఫల్గుణ ఫిలిమ్స్ సంస్థను స్థాపించి ‘జగత్ కిలాడీలు’, ‘జగత్ జంత్రీలు’, ‘జగత్ జెట్టీలు’ వంటి చిత్రాలను తీశారు. తన కుమారుడు ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించారు. ‘మనదేశం’, ‘భీష్మ’, ‘పల్నాటియుద్ధం’ వంటి భారీ చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన 27 సినిమాల్లో 25 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడం విశేషం. రాఘవ హఠాన్మారణంతో టాలీవుడ్ మూగబోయింది. సినీ,రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు ప్రగాఘ సానుభూతి తెలిపారు.

- Advertisement -