ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా ఆటగాళ్లకు కీలకసూచన చేశారు కోచ్ రవిశాస్త్రి. డ్రా కోసం కాదు గెలిచేందుకే ఇక్కడికి వచ్చామని స్పష్టం చేశారు. అత్యుత్తమ పర్యాటక జట్టు అనిపించుకునే సత్తా టీమిండియాకు ఉందని దక్షిణాఫ్రికాలో తమ జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని ఇంగ్లాండ్‌లోనూ దాన్నే కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆగస్టు 1న తొలి టెస్టు ప్రారంభం కానుండగా ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ సేనకు నిరాశే ఎదురైంది. వర్షం కారణంగా ప్రాక్టీస్ సెషన్ రద్దయ్యింది. మొత్తం ప్రాక్టీస్ సెషనే రద్దవ్వడంతో ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితం కావాల్సి వచ్చింది.
గత రెండు పర్యటనల్లో భారత్‌ను మట్టికరిపించింది ఇంగ్లాండ్ టీమ్. అయితే వరుస సిరీస్ పరాజయాలతో ఉన్న ఆ జట్టు గతంలో ఉన్నంత స్ట్రాంగ్‌గా లేకపోవడం మైనస్ పాయింట్స్. చెమ్స్‌ఫోర్డ్‌లో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ముగించుకుని కోహ్లీ సేన ఆదివారం బర్మింగ్‌హామ్ చేరుకుంది.