న‌వంబ‌ర్ లో చిరు, కొర‌టాల మూవీ ప్రారంభం..

209
Chiranjeevi, koratala

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహ‌రెడ్డి జీవిత క‌థ ఆధారంగా ఈచిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈచిత్రానికి ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ పై మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. హైదరాబాద్ శివార్ల‌లో గ‌త కొన్ని రోజులుగా ఈసినిమా షూటింగ్ జ‌రుపుకుంటుంది. చిరంజీవి స‌ర‌స‌న న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టిస్తుంది. వ‌చ్చే వేస‌విలో ఈమూవీని విడుద‌ల చేయాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర‌బృందం.

Chiranjeevi-Koratala-Siva

ఇప్ప‌టివ‌ర‌కూ 40శాతం వ‌ర‌కూ చిత్ర‌క‌ర‌ణ పూర్తి చేసుకుంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఈసినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక చిరంజీవి త‌న త‌రువాతి సినిమా కొర‌టాల శివతో చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. కొరటాల మెగాస్టార్ కు వినిపించిన లైన్ న‌చ్చ‌డంతో క‌థ‌ను రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట కొర‌టాల‌. ప్ర‌స్తుతం కొర‌టాల కూడా ఏహీరోతో సినిమాకు ఒప్పుకోక‌పోవ‌డంతో ఈమూవీపై క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

syeeraa

న‌వంబ‌ర్ మొద‌టి వారంలో ఈసినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. అంతలోపు సైరా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో రెండు సినిమాల్లో బిజీగా గ‌డ‌పనున్నాడు చిరంజీవి. ఇక కొర‌టాల శివ తీసిన సినిమాలు భారీ విజ‌యాలు సాధించ‌డంతో ఈసినిమాపై కూడా పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకున్నారు మెగా అభిమానులు. అయితే ఈసినిమాలో హీరోయిన్గా ఎవ‌రిని తీసుకోవాల‌నే దాని గురించి చ‌ర్చిస్తున్నారు చిత్ర‌బృందం. త్రిష‌, అనుష్క‌, శ్రీయ వీరి ముగ్గురిలో ఎవ‌రినో ఒక్క‌రిని తీసుకోనున్న‌ట్లు తెలుస్తుంది.