లేచిరా….కరుణానిధి కోసం ఇళయరాజా సాంగ్

273
karunanidhi ilayaraja
- Advertisement -

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా పేరు వినని సంగీత ప్రియులు, సినిమా అభిమానులు ఉండరు. ఐదు దశాబ్దాల కాలంగా ఇళయరాజా సంగీతం అలరిస్తూనే ఉంది. ముఖ్యంగా 70, 80, 90 దశకాలలో ఇళయరాజా సంగీతం అంటే చెవికోసుకునేవారు. తెలుగులో కూడా ఆయన వందలాది చిత్రాలకు ఆణిముత్యాల్లాంటి పాటలు అందించారు.

తాజాగా డీఎంకే చీఫ్ కరుణానిధి కోసం స్వయంగా పాటపాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన లేచిరా మమ్ముల్ని చూసేందుకు అంటూ పాటపాడారు. తాను ఎంతగానో అభిమానించే కరుణానిధి క్షేమంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు డీఎంకే శ్రేణులు,కరుణానిధి అభిమానుల పూజలు, ప్రార్థనలతో ఆళ్వార్‌ పేటలోని కావేరి ఆస్పత్రి పరిసరాలు మునిగిపోయాయి. తమిళనాడు సీఎం పళనిస్వామి …కరుణానిధిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్ధితిని డాక్టర్లు,కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కరుణ సంపూర్ణ ఆర్యోగవంతుడిగా మళ్లీ ప్రజా సేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు.

- Advertisement -