బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అమెరికన్ నటుడు, సింగర్ నిక్ జోనాస్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనుమానాలకు తగ్గటుగానే.. ఈ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యనే నిక్ తన బంధువుల పెళ్లికి ప్రియాంకను తీసుకెళ్లి, తన తల్లితండ్రులకు పరిచయం చేశారు. ఇక ప్రియాంక కూడా నూతన గృహప్రవేశానికి నిక్ ని ఆహ్వానించి, తన తల్లి మధుచోప్రాకి పరిచయం చేసింది.
నిక్ తో కలిసి డిన్నర్ కి వెళ్లిన మధుచోప్రాని నిక్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండని మీడియా అడగగా.. ఇప్పుడే కలిశాం.. అప్పుడే ఏం చెప్పలేను అంటూ వెళ్లిపోయింది. తన కూతురిని మాత్రం ఓ విదేశియుడికి ఇవ్వదలచుకోలేదు అని గతంలో మధుచోప్రా స్పష్టం చేసింది. విదేశియుడైనా నిక్ తో ప్రియాంక పికలోతుల మేర ప్రేమలో ఉంది. ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిక్ తో ప్రియాంక పెళ్లికి మధు ఒప్పుకుంటుందో లేదో చూడాలి ఇక.
మరోవైపు ప్రియాంక్, నిక్ ఇద్దరు ప్రేమించుకోవడానికి తానే కారణం అంటున్నాడు హాలీవుడ్ స్టార్ హీరో డ్వెయిన్ జాన్సన్. బేచావ్ సినిమాలో ప్రియాంకతో నటించానని, అలాగే నిక్ తో కలిసి ‘జుమాంజి’ చిత్రంలో నటించానని, ఇలా ఈ ఇద్దరికి కామన్ ఫ్రెండ్ గా ఉంటూ వారి ప్రేమకు సహకరించానని చెప్పాడు. వారిద్దరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారంటే ఆ క్రెడిట్ అంతా తనదే అంటున్నాడు ఈ స్టార్ హీరో. వీరి ప్రేమపై ఇంత ప్రచారం జరుగుతున్నా.. పెళ్లిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.