టాక్సీ డ్రైవర్‌గా మారనున్న సమంత..!

262
- Advertisement -

అందాలతార సమంత దక్షిణాదిన అగ్ర హీరోయిన్లలో ఒక‌రు‌. ఆమె న‌టించిన సినిమాల‌న్ని సూప‌ర్ డూప‌ర్ హీట్ల‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఇటివ‌లే స‌మంత న‌టించిన మూడు సినిమాలు భారీ విజ‌యాన్ని అందుకున్నాయి. మార్చి చివ‌ర‌లో విడుద‌లైన రంగ‌స్ధ‌లం సినిమా సూప‌ర్ కావ‌డంతో ఆ త‌రువాత వ‌చ్చిన మ‌హ‌న‌టి సినిమా కూడా భారీ విజ‌యాన్ని అందుకుంది. విశాల్‌ సరసన నటించిన అభిమన్యుడు సినిమా కూడా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సమంత చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి.

Samantha

ప్రస్తుతం సమంత తెలుగులో ‘యూ టర్న్’ సినిమా చేస్తోంది .. తమిళంలో ‘సీమరాజా’ సినిమా చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల తరువాత ఆమె ఒక థ్రిల్లర్ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్‌లో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ‘కొలాటెరల్’ ఘనవిజయాన్ని సాధించింది. దాంతో ఈ సినిమా నుంచి మూలాన్ని తీసుకుని తెలుగు నేటివిటీకి తగినట్టుగా తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికి అసోసియేట్ గా పనిచేసిన గిరీశయ్య దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమాలో కీలకమైనదిగా కనిపించే టాక్సీ డ్రైవర్ పాత్రలో సమంతను కనిపించనుంది. ఈ పాత్రకి గల ప్రాధాన్యత కారణంగా సమంత ఈ మూవీ అంగీకరించిందని అంటున్నారు. ఈ సినిమాలోని ఇతర ముఖ్యమైన పాత్రల్లో మురళీశర్మ .. అరుణ్ ఆదిత్ .. నవదీప్ .. సాయిచంద్ కనిపించనున్నట్టు చెబుతున్నారు. అధికారిక ప్రకటన రావల్సివుంది.

- Advertisement -