సుప్రీమ్ స్టార్ సాయి ధరమ్ తేజ్ నటించి తేజ్ ఐ లవ్ యూ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈసినిమాలో తేజ్ కు జోడిగా అనుపమా పరమేశ్వరన్ నటించింది. ప్రేమ కథల స్పెషలిస్ట్ గా పేరుగాంచిన కరుణాకరన్ ఈసినిమాకు దర్శకత్వం వహించారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మించారు. సాయి ధరమ్ తేజ్ పూర్తి స్ధాయిలో లవర్ బాయ్ గా ఈసినిమాతో నటించాడు. డైరెక్టర్ కరుణాకరన్, హీరో సాయి ధరమ్ తేజ్ ఈసినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఇక కరుణాకరన్ తర్వాతి సినిమా కిషోర్ తిరుమల తో చేయనున్నాడు. త్వరలోనే ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు చిత్రబృందం. నేను..శైలజా, ఉన్నది ఒకటే జిందగి వంచి హిట్ సినిమాలు తిసి రామ్ కెరీర్ లో మంచి హిట్ ను అందించాడు. ఇక తన తరువాతి సినిమాగా సాయి ధరమ్ తేజ్ ఓ విభిన్న మైన కథను ఎంచుకున్నట్లు తెలుస్తుంది.
ఈమధ్య టాలీవుడ్ దర్శకులు పురాతన కాలంనాటి వీరుల చరిత్రను ఆధారంగా తీసుకుని వాటికి అనుగుణంగా కథను రెడీ చేసుకుని తెలుగు తెరపై కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఇలాంటి కథలకు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపడంతో దర్శకులు, నిర్మాతలు ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు వీరు పోట్ల కూడా ఇటివలే ఈలాంటి కథను ఒకటి సిద్దం చేశాడని సమాచారం. శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి కథను ఆధారంగా చేసుకుని ఈసినిమాను తీయనున్నాడని తెలుస్తుంది. ఈకథకు సాయి ధరమ్ తేజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. త్వరలోనే ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.