టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షి, గన్ లైసెన్స్ కి దరఖాస్తు చేసుకుంది. ఇంటి దగ్గర చాలా సందర్భాలలో ఒంటరిగానే ఉంటానని, తరచు బయట ఒంటరిగానే ప్రయాణిస్తానని, ఈ క్రమంలో తానను ఎవరైనా టార్గెట్ చేసే అవకాశం ఉందన సాక్షి చెప్పింది. ఆ భయంతోనే గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపింది.
పిస్టల్ లేదా 3.2 రివాల్వర్ ను తీసుకోవాలని భావిస్తున్నానని చెప్పింది. రాంఛీ మేజిస్ట్రేట్ కార్యాలయంలో ఆమె గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు స్వీకరించిన పోలీసులు వెరిఫికేషన్ చేస్తున్నారు. ఇక ధోనీ కూడా గన్ లైసెన్స్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ముందు ధోనీ దరఖాస్తును తిరస్కరించారు. మళ్లీ కొద్దిరోజుల తరువాత 9 ఎంఎం పిస్టల్ కు లైసెన్స్ ఇచ్చారు.
మరోవైపు భారత క్రికెటర్లకు తప్పనిసరిగా మారిన యోయో ఫిట్నెస్ పరీక్షలో ధోనీనే అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత కెప్టెన్ విరాట్, రైనా భువనేశ్వర్, జాదవ్, బుమ్రా, సిద్దార్థ్ కౌల్, వాషింగ్టన్ సుందర్, చాహల్, మనీష్ పాండేలు యోయో టెస్ట్‌లో పాస్ అయ్యారు. కానీ మంచి ఫామ్ లో ఉన్న అంబటి రాయుడు మాత్రం యోయో టెస్టులో ఫెయిల్ అయ్యాడు.