ప్రభాస్‌కు సీక్రెట్‌ మెసేజ్‌ చేసింది..

142
Kiara Advani secret messege to prabhas

ప్రభాస్‌ స్టార్ ఇమేజ్ ఇప్పుడు బాహుబలి’ సినిమాతో ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది. తెలుగులో ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో దానికి డబుల్ క్రేజ్‌ను తచ్చేసుకుని బాహుబలితో నేషనల్ స్టార్‌గా ఎదిగేశాడు ఈ  రెబల్ స్టార్.

తెలుగులో ఎవరికీ లేనంత స్టార్‌ డమ్‌ ని సంపాధించుకున్నాడు ప్రభాస్‌. ఇప్పటికే భారీ ప్రాజెక్టులు ప్రభాస్‌ ముందు వాలిపోతున్నాయి. ఇతర ఇండస్ట్రీ దర్శకులు కూడా ప్రభాస్‌తో సినిమా తియ్యడానికి క్యూ కడుతున్నారు. ఇక ప్రభాస్‌ ఫాలోయింగ్‌ విషయానికొస్తే.. ఈ రెబెల్‌ స్టార్‌కున్న లేడీ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు.
 Kiara Advani secret messege to prabhas
అయితే ఓ బాలీవుడ్‌ భామ కూడా ప్రభాస్‌కి పడిపోయిందనే వార్త సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ధోని హీరోయిన్ కియారా అద్వానీ ప్రభాస్‌కు ఓ సీక్రెట్ మెసేజ్ పెట్టిందట. ఈ అమ్మడు ప్రభాస్‌ అంటే పడిచస్తోందట. గతంలో పలుసార్లు ప్రభాస్ ను కలవడానికి కూడా ప్రయత్నించిందట కియారా. కానీ, ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురైందట.
Kiara Advani secret messege to prabhas
దాంతో ప్రభాస్‌ కోసం మరింత ఓపెన్‌ అయిపోయింది ఈ భామ. ప్రభాస్‌ నెంబర్‌ కోసం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ హీరో ని కలుసుకుందట. ఆ హీరో ద్వారా ప్రభాస్ నంబర్ సంపాదించి ప్రభాస్‌కి మెసేజ్ పెట్టేసిందట.

అయితే ఏమని మెసేజ్ పెట్టిందో తెలియకపోయినా.. ఆ మెసేజ్‌కు మాత్రం ప్రభాస్ రిప్లై కూడా ఇచ్చాడట. అయితే ఇన్ని తంటాలు పడి ప్రభాస్ నెంబర్‌ కనుక్కున్న ఈ బ్యూటీ ప్రభాస్‌ పక్కన నటించడం కోసమేనంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.