ధోని రిటైర్మెంట్‌పై సాక్షి క్లారిటీ..!

286

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం చేసిన ఓ ట్వీట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించడానికి గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశాడనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్‌కు తన నిర్ణయాన్ని చెప్పేశాడని… గురువారం తన నిర్ణయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి.

Dhoni

అయితే ఈ వార్తపై ధోనీ అర్ధాంగి సాక్షి క్లారిటీ ఇచ్చింది. ట్విట్టర్‌లో ప్రత్యేకంగా ఇదీ విషయం అని పేర్కొనకపోయినా సాక్షి చేసిన సింగిల్ లైన్ ట్వీట్‌తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. “మరి, వీటినే పుకార్లు అంటారు!” అంటూ సాక్షి ట్వీట్ చేసింది. ఆ చిన్న ట్వీట్ ధోనీ అభిమానుల్లో ఎంత సంతోషం నింపిందో చెప్పాలంటే ఆ ట్వీట్ కు వచ్చిన రీట్వీట్లు (6 వేలు), లైకులు (17.9 వేలు) చూడాల్సిందే!

దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కు ధోనీని ఎంపిక చేయకపోవడంతో ధోని రిటైర్మెంట్ చేయనున్నాడంటు వార్తలు వచ్చాయి. మరోవైపు ధోనీ రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ స్పందించింది. ధోనీ రిటైర్మెంట్‌కి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు.