మహేశ్ న్యూ మూవీ.. న్యూ లుక్‌..!

240
Mahesh babu

ప్రిన్స్‌ మహేశ్ బాబు 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ‘డెహ్రాడూన్’లో మొదలైంది. మహేష్ బాబు- పూజా హెగ్డేల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. ఈ సినిమాలో మహేశ్ బాబు కొత్త లుక్‌తో కనిపించనున్నాడనే టాక్ వచ్చిన దగ్గర నుంచి, ఆయనని ఆ లుక్‌తో చూడాలని అభిమానులంతా ఆసక్తిని చూపుతున్నారు.

Mahesh Babu

తాజాగా ఈ మూవీ ష్యూటింగ్‌ జరుగుతున్న లొకేషన్‌ నుండి ఒకటి ఫొటో బయటికి వచ్చింది. ఈ లుక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. రఫ్ హెయిర్ స్టైల్ తో .. సన్నని మీసకట్టుతో .. లైట్ గా పెరిగిన గెడ్డంతో .. హాఫ్ హాండ్స్ షర్ట్ తో మహేశ్ బాబు కనిపిస్తున్నాడు. ఈ లుక్ తో నిజంగానే ఆయన చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో మహేశ్ బాబు జోడీగా పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఇక సినిమా కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.