జె.బి మురళీకృష్ణ దర్శకత్వంలో శ్రీనివాస్ రెడ్డి కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘జంబ లకిడి పంబ’. ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీనివాస్ రెడ్డి సరసన సిద్ది ఇద్నానీ కథానాయికగా నటించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా దర్శకుడు మురళీకృష్ణ హైదరాబాద్ లో విలేకర్లతో ముచ్చటించారు. నేటి యూత్ ఆలోచనలకు అనుగుణంగా ఈ సినిమాను తెరికెక్కించానని తెలిపారు.
ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంట తర్వాత ఎలా ఉంటారు. ఎవరూ ఊహించని విధంగా అబ్బాయి అమ్మాయిగాను, అమ్మాయి అబ్బాయిగాను మారిపోతారని, అలా ఎలా మారారు ఆ తర్వాత ఏం జరిగిందే అని విషయాన్ని తెరకెక్కించామని చెప్పారు. మొదట ఈ సినిమాకు ‘కుడి ఎడమైతే’ అనే టైటిల్ పెట్టాలనుకున్నాం కానీ మా కథలో ఆత్మలు మారుతుండడంతో శ్రేయోభిలాషులు ‘జంబలికిడి పంబ టైటిల్’ పెట్టాలని సూచించారని చెప్పుకొచ్చారు.
ఈ కథను 116 మందికి వినిపించా అందరికి నచ్చింది. కానీ ఆత్మలు మారడం అనగానే నిర్మాతలు వెనక్కి తగ్గారు అని చెప్పారు. ఈ సినిమా సహ నిర్మాత సురేష్ రెడ్డి కథ విని ఓకే చెప్పారని, కానీ మొత్తం బడ్జెట్ పెట్టలేనని చెప్పడంతో, అనంతరం రవి, జోజోలకి కథ నచ్చి నిర్మించడానికి ముందుకు వచ్చారని తెలిపారు. ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి అద్భుతంగా నటించారని, అతనుకాకుండా వేరే వాళ్లు ఈ కథకు న్యాయం చేయలేరోమో అనిపించేలా చేశారని పేర్కొన్నారు. కథానాయిక సిద్ని ఇద్నాని కూడా బాగా నటించారని చెప్పారు.
శ్రీను కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా జంబలకిడి పంబ
జంబ లకిడి పంబలో సిద్ది ఇద్నాని