రూమర్స్‌కు చెక్‌ పెట్టిన రానా..!

172
rana

కొన్నిరోజులగా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై స్పందించారు రానా. తాను కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కంటికి ఆపరేషన్ చేయించుకోవాలి…అయితే హైబీపీ సమస్య ఉండటం వల్ల సర్జరీ ఆలస్యమవుతుందని అంతేగాని కిడ్నీ సమస్యలేమీ లేవంటూ తెలిపారు.

బాహుబలి తర్వాత ఘాజీ,నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో మంచి సక్సెస్ కొట్టాడు రానా. ప్రస్తుతం వరుస సినిమాతో బిజీగా ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 1945 సినిమాతో పాటు కేరళ ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందిన మహారాజ తిరునాళ్ మార్తాండ్ వర్మ సినిమాలో నటించనున్నాడు. తెలుగు,తమిళ భాషలలో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

దీంతో పాటు 1971లో హిందీలో వచ్చిన హథీ మేరీ సాథీ రీమేక్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమానే కాక గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశ్యపతో పాటు బాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపించ‌నున్నాడు రానా.