పంతం పాటల సందడి

283
Pantham
- Advertisement -

యాక్ష‌న్ స్టార్ గోపీచంద్ హీరోగా కె.చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం పంతం. గోపిచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.,రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపిచంద్ నటించిన 25వ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలె సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టగా జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు.

రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌తో గోపిచంద్ తన మార్క్‌ను చూపించాడు. సినిమా ఎలా ఉంటుందో శాంపిల్ చూపించేశారు. ఓటును ఐదువేల‌కు అమ్ముకుని అవినీతి లేని స‌మాజం కావాలి.. క‌రెప్ష‌న్ లేని కంట్రీ కావాలంటే ఎక్క‌డి నుండి వ‌స్తాయి అని హీరో కోర్టులో వేసే ప్ర‌శ్న‌.. అంద‌రినీ ఆలోచింప‌చేసేదిగా, ఎమోష‌న‌ల్‌గా ఉంది. మొత్తంగా గోపీచంద్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌న‌ప‌డ‌ని క్యారెక్ట‌ర్‌లో సంద‌డి చేయ‌బోతున్నారు.

- Advertisement -