ఇటీవలె జరిగిన ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక బౌలర్ గా యజువేంద్ర చాహల్ అద్భుతమైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. తన అద్భుతమైన స్పిన్ తో బ్యాట్స్ మెన్లను బోల్తా కొట్టించాడు. ఈ యువ స్పిన్నర్ తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి భారత జట్టులో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే తాను గొప్ప ప్రదర్శన చేయడానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ సహాయపడ్డాడని తెలిపాడు.
ఓ టీవీ షో కార్యక్రమంలో మాట్లుతూ… తాను అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి విరాట్ భయ్య సహాయం చేశాడు. నేను ఇంకా అత్యుత్తమంగా రాణించేందుకు విరాట్ భయ్యను ఆదర్శంగా తీసుకున్నానంటు చెప్పుకొచ్చాడు. ఆట విషయంలోనే కాక వ్యక్తిగత విషయాల్లోనూ చాలా సహాయం చేశాడు. నేను ఫిట్ ఉండాలని సూచించాడు. ఆటగాడికి ఫిట్ నెస్ ప్రాముఖ్యతను తెలియజేశాడు. ఆటగాడికి ఫిట్ నెస్ ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకున్నా అంటూ చాహల్ చెప్పుకొచ్చారు.