సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం భరత్ అనే నేను మూవీ సక్సెన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. మహేశ్ కెరీర్ లోనే భరత్ అనే నేను సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేశ్ బాబు తన ఫ్యామిలీతో ఫారిన్ లో సరదాగా గడుపుతున్నాడు. మహేశ్ బాబు ఇంతవరకూ 24 సినిమాలు చేశాడు. అయితే 25వ సినిమా వంశీపైడిపల్లి దర్శకత్వంలో చేనున్నాడు. ఈసినిమాకు సంబంధించి స్క్రీప్ట్ పరంగా అన్ని పనులు పూర్తయ్యాని సమచారం. మరో రెండు వారాల్లో ఈసినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఇక ఈసినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను అల్లరి నరేశ్ చేయనున్నాడని వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఈసినిమాలో చేయడానికి వంశీ పైడిపల్లి అల్లరి నరేష్ ను కూడా సంప్రదించినట్టు సమాచారం. అందుకు నరేష్ కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈప్రాజెక్ట్ కి సంబంధించిన అగ్రిమెంట్ పై అల్లరి నరేష్ సైన్ కూడా చేసినట్టు చెబుతున్నారు. ఈమూవీలో ఆయన మహేశ్ బాబు స్నేహితుడిగా నటించనున్నాడని సమాచారం. పుల్ లెన్త్ గా ఈసినిమాలో అల్లరి నరేష్ కనపించనున్నాడని తెలుస్తుంది. ఫస్టాప్ లో కమెడియన్ కనిపించి..సెకాండఫ్ లో ఎమోషనల్ పాత్రలో చేనున్నాడని తెలుస్తుంది.
మహేశ్ బాబు ఫారిన్ ట్రిప్ నుంచి వచ్చిన వారం రోజుల్లో ఈసినిమాను ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు చిత్ర యూనిట్. జులై నుంచి అల్లరి నరేష్ షూటింగ్ పాల్గోంటారని సమాచారం. ఈసినిమాలో అల్లరి నరేష్ పాత్రకి ఆయనకు మంచి గుర్తింపు తీసుకువస్తుందని తెలుస్తుంది. ఈసినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహిరంచనున్నాడు.