చంద్రబాబు…నమ్మక ద్రోహి

231
Mothkupalli hits out Chandra Babu
- Advertisement -

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. టీడీపీ నుంచి మోత్కుపల్లిని బహిష్కరించిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆత్మను అమ్ముకునే నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబుకు అండగా నిలిచినందుకు తనకు తగిన శాస్త్రే జరిగిందన్నారు.

ప్రపంచంలో చంద్రబాబు అంత మోసగాడు, దొంగ, నీచుడు ఇంకెవరూ లేడన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎంత నీచపనికైనా దిగజారుతాడని చెప్పారు. చంద్రబాబు మగాడైతే సొంత జెండాతో రావాలన్న మోత్కుపల్లి…పనికిమాలిన వ్యక్తులతో తనను తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

దయచేసి ఆంద్ర ప్రజలకు తెలిపేది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబుకు ఓటు వేయోద్దని కోరిన మోత్కుపల్లి.. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావద్దని తిరుమల శ్రీవారిని కోరుతున్నట్లు చెప్పారు. దైర్యం ఉంటే తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయమని సవాల్ విసిరారు.

పెద్దనోట్ల రద్దు గురించి మోడీకి చెప్పిందే చంద్రబాబు అని..నాలుగు సంవత్సరాలు మోడీ చుట్టి తిరిగి చివరకు ప్రధానికే నమ్మకం ద్రోహం చేసిన గజదొంగ చంద్రబాబు అన్నారు. చంద్రబాబు లేకపోయిన జగన్ ప్రత్యేక హోదా తెస్తారని, చంద్రబాబుపై 29 కేసులున్నాయని బాబుపై సీబీఐ విచారణ జరిపించాలని మోడీని వేడుకుంటున్నట్లు చెప్పారు.

- Advertisement -