వెంకీ, చైతూలకు జంటగా వాళ్లిద్దరు..

205
chaitu and venky
- Advertisement -

బాబీ దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా ఓ మల్టీస్టారర్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని త్వరలో పట్టాలెక్కనుంది. ఇక కథానాయికల విషయానికొస్తే వీరిద్దరి సరసన గతంతో నటించినవారే మళ్లీ నటించడం విశేషం. వెంకటేష్‌కు జోడిగా నయనతారను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

chaitu and venky

గతంలో వీరిద్దరు కలిసి నటించిన చిత్రం ‘లక్ష్మీ’. ఈ సినిమా సాధించిన విజయం గురించి తెలిసిందే. నయనతార తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇక నాగచైతన్య సరసన రకుల్‌ను ఎంపిక చేసుకున్నారట. చైతూ, రకుల్ జంటగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే సినిమాలో కలిసి నటించారు. మళ్లీ ఈ మల్టీస్టారర్‌లో ఇద్దరు కలిసి నటించనున్నారు.

అయితే ఈ ఇద్దరు కథానాయికలు వెంకీ,చైతూల మధ్య కెమెస్ట్ర్రీ కుదరటంతో మరోసారి వీరిని తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం చైతూ ‘సవ్యసాచి’ సినిమాలో బిజీగా ఉండగా వెంకటేష్ ‘ఆట నాదే వేట నాదే’ అనే సినిమాలో నటించబోతున్నాడు. ఇక ఈ మల్టీస్టారర్‌కు కిరణ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా త్వరలో ఈ సినిమాసెట్స్‌ పైకి వెళ్లనుంది.

- Advertisement -