తన ఆటతీరుతోనే కాకుండా.. తన వ్యక్తిత్వంతోనూ అందరిని ఆకట్టుకుంటాడు టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోని. ఈ మిస్టర్ కూల్ చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో చెన్నై వరుస విజయాలతో దూసుకుపోతోంది.
చెన్నైలో కావేరి జలాల వివాదం కారణంగా చెన్నై మ్యాచ్‌లను పుణెకు తరలించారు. చెన్నైలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడారు. మిగతా ఆరు మ్యాచ్‌లు పుణెలోనే జరిగాయి. పుణె గ్రౌండ్ కూడా చెన్నై టీంకు బాగానే కలిసొచ్చింది. ఈ గ్రౌండ్లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఐదు విజయాలు అందుకుంది.
నిన్న పంజాబ్‌తో జరిగన మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. అతి తక్కువ సమయంలో గ్రౌండ్‌ను మ్యాచ్‌లకు సిద్ధం చేస్తున్న గ్రౌండ్‌మెన్‌కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. చెన్నై టీం తరపున ఒక్కొక్కరికి రూ.20 వేల నగదుతోపాటు, తనతో దిగిన ఫోటోను కూడా ఫ్రేమ్ కట్టించి ఇచ్చాడు ధోని.
వెంటవెంటనే మ్యాచ్‌లు ఉన్నప్పటికీ.. అతి తక్కువ సమయంలో గ్రౌండ్‌ను సిద్దం చేసిన సిబ్బందికి తమకు తోచిన సహాయం చేశామని చెన్నై టీమ్ మేనేజ్మెంట్ సభ్యుడు తెలిపారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ధోని గ్రౌండ్ మెన్‌ను కలిసి ఈ గిఫ్టులు అందించాడు.
The parting gesture for the #PuneGroundStaff for all the #yellove support at the #DenAwayFromDen . #WhistlePodu #yellove #CSKvKXIP 🦁💛 pic.twitter.com/g5NepImno7
— Chennai Super Kings (@ChennaiIPL) May 20, 2018