త్రీడీ హారర్ ‘లిసా’తో రానున్న అంజలి..

199
Anjali plays the lead in the 3D horror film Lisaa
- Advertisement -

టాలీవుడ్‌లో కథానాయికలు గ్లామర్ పాత్రలే కాకుండా మంచి కంటెంట్ ఉన్న హారర్ సినిమాలు చేసేందుకు కూడా ఓకే చెబుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంత కాలంగా హారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాలను సాధించాయి. చిన్న సినిమాలుగా వచ్చి కొత్తదనం లేకపోయినా కమెడీని, కాస్త లవ్ సీన్స్ జోడిస్తూ హారర్ చిత్రాలు తెరకెక్కిస్తూ హిట్‌లు కొడుతున్నారు.

Anjali plays the lead in the 3D horror film Lisaa

ప్రేమకథా చిత్రం, రాజుగారి గది, రాజుగారి గది-2, కాంచన, ఆనందో బ్రహ్మా వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగు, తమిళ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటి అంజలి కూడా అదే రూట్‌లో వెళుతోంది. గతంలో ‘గీతాంజలి’ అనే హారర్ మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ సినిమాను నుంచి అలాంటి పాత్రలే చేయడానికి ఇష్టపడుతోంది ఈ బ్యూటీ.

అంజలి మరోసారి అలాంటి హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ‘లిసా’ అనే త్రీడీ హారర్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు రాజు విశ్వనాథ్. ఇక ఇటీవలె విడుదలైన ఫస్ట్ లుక్‌లో అంజలి విశ్వరూపం కనిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -