అద్భుతమైన ఫిల్డింగ్ , బౌలింగ్ తో ప్లే ఆఫ్ కు చేరింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపిఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోర్ చేసి బౌలింగ్ తన సత్తా చాటిన టీంగా సన్ రైజర్ కు పేరుంది. మొదట్లో ఆడిన మ్యాచ్ లు అన్ని గెలుచుకుంటూ వచ్చి పాయింట్ల పట్టికలో మొదటి స్దానంలో నిలిచింది. ఆడిన 13 మ్యాచ్ లలో 9 మ్యాచ్ లు గెలిసింది. ఇక నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్ లో తాము నమ్ముకున్న బౌలింగ్ లోనే పూర్తిగా విఫలమయ్యారు. ఈసిజన్ లో నాలుగో ఓటమిని చవిచూసింది. సన్ రైజర్స్ బౌలింగ్ లో బెంగుళూరు బ్యాట్స్ మెన్లు దంచికొట్టారు.
ఇక సన్ రైజర్ యువ బౌలర్ బాసిల్ థంపి ఈ మ్యాచ్ లో్ గోరంగా విఫలం చెందాడు. 4ఓవర్లలో ఏకంగా 70పరుగులు ఇచ్చి చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలోనే ఎక్కువ పరగులు ఇచ్చిన ఆటగాడిగా రికార్డు నమోదు చేసుకున్నాడు. సన్ రైజర్ పేసర్ బౌలర్ భువనేశ్వర్ స్ధానంలో జట్టులోకి ఎంపికయ్యాడు థంపి. ఇంతకు ముందు ఈ రికార్డు ఇండియా పేస్ బౌలర్ ఇషాంత్ షర్మకు ఉన్న ఈ రికార్డును బ్రేక్ చేశాడు థంపీ. ఇక ఇషాంత్ శర్మ తర్వాత ఐపిఎల్ లో అత్యంత పరుగులిచ్చిన బౌలర్లలో..ఉమేష్ యాదవ్(65), సందీప్ శర్మ(65), వరుణ్ అరోన్ (63) అశోక్ దిండా(63) అత్యధిక పరుగులిచ్చిన జాబితాలో ఉన్నారు.
అద్బుతమైన బ్యాటింగ్ తో మ్యాచ్ ను గెలిపించారు బెంగుళూరు బ్యాట్స్ మెన్లు ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ అత్యధిక పరుగులు చేసి..మ్యాచ్ విజయంలో కీలకపాత్రలో పోషించారు. చేజింగ్ ఏమాత్రం తడబడని సన్ రైజర్స్ టీం చివరి వరకూ పోరాడి ఓడిపోయింది. హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్ సన్స్ 86 పరుగులు అలాగే మనిష్ పాండే 62 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.