ఐపీఎల్-11లో భాగంగా నిన్న ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉప్పల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలనడిర సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ ఆటగాళ్లు బ్యాటింగ్‌కు దిగారు. మొదట బౌలింగ్ వేసిన అంకిత్ రాజ్‌పూత్ నాలుగో బంతికే విలియమ్సన్స్ను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బ తీశాడు. అనంతరం మూడో ఓవర్లో అంకిత్ రాజ్‌పూత్ వేసిన రెండో బంతిని ధావన్ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు
అయితే బడా వికెట్ తీసిన రాజ్‌పూత్ ధావన్‌ని ఉద్దేశిస్తూ అసభ్య పదజాలంతో తిట్టాడు. ఈ సంఘటన టీవీ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన ధావన్ అభిమానులు రాజ్పూత్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి కూడా భారత్ జెర్సీ ధరించని ఓ ఆటగాడు సీనియర్ క్రీడాకారుడిపై అసభ్యంగా మాట్లాడటం ఏంటని క్రికెట్ అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఇది క్రిడాస్ఫూర్తిగా విరుదమన్నారు. అద్భుతమైన బౌలింగ్ చేసి, అందరిని ఆకట్టుకుంటున్నావు, ఆటలో సీనియర్లను గౌరవించడం నేర్చుకో అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు.
— vineet kishor (@vineetkishor2) April 26, 2018
https://twitter.com/Thesnehashis/status/989559980633112576