కాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్ననతో టాక్ ఆఫ్ దీ టౌన్‌గా మారింది. దీనిపై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. సామాజిక కార్యకర్తల కూడా శ్రీరెడ్డికి మద్దతు ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో శ్రీరెడ్డి పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వరుణ్ తేజ్, నితిన్ స్పందించగా తాజాగా సాయిధరమ్ తేజ్ కూడా స్పందించాడు. తనదైన స్టైల్‌లో పవన్ మాట్లాడిన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు తేజు.
ఈ వీడియోలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘కష్టాలుంటాయ్.. పాలిటిక్స్‌లో.. నన్ను తిడుతుంటే ఒక్కోసారి మీకు ఇబ్బంది కలగొచ్చు. నేను భరిస్తాను.. బలవంతుడే భరిస్తాడు. మనం బలమైన వ్యక్తులం.. భరిద్దాం. భరించిన వాడే సాధించగలడు. అంతేగానీ మాట అనేసారు కదా అని పారిపోతే ఎట్లా.. అలా అయితే నిన్ను తిట్టేవారు విజయం సాధించినట్లు. అలా పారిపోవద్దు దేన్నుంచి. అలా అనిచెప్పి ఎదురుదాడి చెయ్యొద్దు. భరించండి.. చూడండి.. ఎంతసేపంటారో చూడండి. మార్చు చాలా సైలెంట్‌గా అదే వచ్చేస్తుంది. భరించడం వల్ల వచ్చేశక్తి చాలా బలమైన శక్తి మన లోపలినుంచి’’ అన్నారు పవన్ కల్యాణ్. సాయిధరమ్ తేజ్ చేసిన ఈ ట్వీట్‌తో ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 17, 2018