తెలుగు సినిమాలో ఇండస్ట్రీలో తాజాగా వెలుగు చూసిన వివాదం కాస్టింగ్ కౌచ్. దీనిపై శ్రీరెడ్డి చేస్తున్న వివాదం అంతా ఇంతా కాదు. ఆమెకు మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వివాదం రోజు రోజుకు ఉదృతమవుతూ శ్రీరెడ్డికి బలం పెరుగుతోంది. ఈ సెగ పవన్ కల్యాణ్‌కు కూడా తాకింది. తాజాగా నటీ మధవీలత పవన్ కల్యాణ్‌పై తన ఫేస్ బుక్ ఖాతాలో ఫోస్టు ద్వ్గారా తీవ్రంగా విరుచుకుపడింది.
కాస్టింగ్ కౌచ్‌పై పవన్ కల్యాణ్‌కు వాస్తవేమిటో తెలుసని నటీ మధవీలత తెలిపారు. “పవన్ కల్యాణ్ కు నిజం తెలుసు. ఇన్నాళ్లూ స్పందించలేదు. ఇప్పుడు కూడా తప్పదు కనుక ఈ విషయంలో నోరు విప్పారు. చాలా త్వరలో పవన్ కల్యాణ్ కు తెలిసిన నిజం ఏంటో బయటకు వస్తుంది. వెయిట్ అండ్ సీ ది గేమ్. నేను కూడా నిజం కోసం ఎదురు చూస్తున్నాను. ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిన నిజం… పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ స్పందించక పోవడానికి వెనుక ఉన్న నిజం… ఏంటి ఫ్యాన్స్… మీకే చెబుతున్నా… పవన్ కల్యాణ్ మీరు అనుకునేంత తెలివి తక్కువ పర్సన్ కాదు. ఇవాళ స్పందన తప్పదు కనుక చెప్పారు. అతి త్వరలోనే నిప్పులాంటి నిజాలు వస్తాయ్… నేను ఎదురు చూస్తున్నా” అని మాధవీలత తన ఫేసు బుక్‌లో పోస్టు పెడుతూ ఆవేదన వ్యక్తం చేసింది.