సోనమ్ పెళ్లి సందడి మొదలైంది..!

283
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనిల్ కపూర్ కూతురు, నటి సోనమ్‌ కపూర్‌ పెళ్లి సందడి మొదలైంది. సోనమ్‌ కపూర్‌ ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజాతో కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి వివాహం మే మొదటి వారంలో చేయాలని ఇరువైపు ల కుటుంబాలు నిర్ణయించాయి. వీరిద్దరు తొలుత తమ వివాహం స్విట్జర్లాండ్‌లో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ కుటుంబీకులంతా ముంబయిలోనే ఉండడంతో ఇక్కడే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.

Sonam Kapoor and Anand Ahuja Wedding

అయితే పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్‌ వేడుకలో డ్యాన్సులతో సందడి చేసేందుకు సోనమ్‌కు..ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ స్టెప్పులు కంపోజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోనమ్‌..ఫరాతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ముంబయిలోని జుహు ప్రాంతంలో అనిల్‌కపూర్‌కి చెందిన బంగ్లాలో సంగీత్‌ రిహార్సల్స్‌ జరుగుతున్నట్లు సోనమ్‌ సన్నిహితులు మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ వేడుకకు సోనమ్‌, ఆనంద్‌ కుటుంబీకులంతా హాజరుకాబోతున్నారు. సోనమ్‌ నటించిన సినిమాల పాటలకే డ్యాన్సులు కంపోజ్‌ చేస్తున్నారు. వివాహం అనంతరం అనుష్క- విరాట్‌లాగే ముంబయి, దిల్లీలో ఘనంగా రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ప్రస్తుతం సోనమ్‌..‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రంలో నటిస్తున్నారు.

- Advertisement -