కావేరి నదీ జలాల విషయంలో కేంద్రం తమినాడుకు అన్యాయం చేసిందని ఓ వైపు నిరసనలు కొనసాగుతుంటే అదే సమయంలో దూసుకొచ్చింది ఐపీఎల్. కొద్దిరోజల క్రితం టీటీవీ దినకరన్ ఏకంగా ఐపీఎల్ ను అడనివ్వకూడదంటూ ఫిర్యాదు చేశాడు.తాజాగా మళ్లీ సూపర్ స్టార్ రజినీకాంత్ ఐపీఎల్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
రాజకీయ పార్టీని స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న తరుణంలో జరుగుతున్నఅన్యాయాలను స్సందిస్తున్నాడు తలైవా. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఒకవైపు కావేరి నదీ జలాల బోర్డును ఏర్పాటు చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తున్న తరుణంలో ఐపీఎల్ క్రికెట్ జరుగుతుండడం చాలా ఇబ్బంది కలుగుతుందని ఆయన తెలిపారు.అంతేకాకుండా..క్రీడాకారులు నిరసనలకు మద్దతుగా కనీసం నల్ల బ్యాడ్జీలైనా దరించి ఆడాలని తన ఆవేదనను వెల్లగక్కారు.
ఇదిలా ఉండగా.. చెన్నైలోని వాల్లువర్ కొట్టామ్ లో కావేరీ జలాల కోసం జరుగుతున్ననిరసనల్లో నటీనటులు ధనుష్, విజయ్, సూర్య, సత్యరాజ్, శివకుమార్, నాజర్, విశాల్, కార్తీ, శివకార్తికేయన్ తదితరులు పాల్గొనగా, వీరి దీక్షకు కమల్, రజీనికాంత్ మద్దతు తెలుపనున్నట్లు సమాచారం.